Pages

Sunday, October 30, 2011

ఇష్టం ప్రేమ పిచ్చి


ఇష్టం ప్రేమ పిచ్చి 

ఒక మనిషి ఇష్టాలను గౌరవిస్తే , దాని పేరు  ఇష్టం
తన ఇష్టాలను నీ ఇష్టాలు గా మార్చుకుంటే అది ప్రేమ
నీ ఇష్టాలను అన్ని వదిలేసి ,తన ఇస్టాలనే  నీ ఇష్టాలు గా మార్చుకుంటే  అది పిచ్చి :)

నాకు కొందరు అంటే ఇష్టం 
కొందరు అంటే ప్రేమ
ఒకరు అంటే 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
పిచ్చి గురించి పబ్లిక్ గా చెప్పితే పిచ్చోడు అంటారు ;)
అందుకే చెప్పట్లేదు ...:)


Saturday, October 29, 2011

మొండి ముసలి ....పెంకి ఆటోవాల...

Dsnr నుండి  LB nagar వస్తునపుడు  అనుకుంట ....60years ఉన్న ఒక వ్యక్తి ఆటో ఆపాడు.
ఆటో ఎక్కకుండా LB Nagar కీ ఎంత అని అడిగాడు.  అప్పుడు ఆ ఆటో వాడు ఎంత ఇస్తావ్ నువ్వే చెప్పు అని అడిగాడు
దానికి ఆ వ్యక్తి మల్లి అదే  ప్రశ్న అడిగాడు ఎంత అనీ . ఆ ఆటోవాల అదే సమాదానం చెప్పాడు ఎంత ఇస్తావ్ అనీ ....
అప్పటికే ఆటో లో నా లాంటి వాళ్ళు ఉన్నారు చిరాకు తో  ....
మేము అందరం కలిసి ముందు మీరు ఎక్కండి సర్ అని ఆ ముసలి వ్యక్తిని  అడిగాం
చివరకి ఎక్కాడు.... డ్రైవర్ పక్కనే తన సీట్
ఆటో లో కూర్చోగానే ఆ  ముసలి "భారతీయుడు" ఆటో అతని మీద తన మోచితి ని పెట్టి ఏమి  బాబు ఎంత ఇస్తే అంత తిస్కుంటావా???
1rs ఇస్తే ఒక్క రూపాయే తిస్కుంటావా?? అని రఘుబాబు అంత వెటకారంగా అడిగాడు
అపుడు మన "యువ" ఆటో వాడు ..అలాగే తన చేతి నీ ఆ ముసలాయన మీద వేసి  మరేం తాత నేను ఎంత అడుగుతే అంత ఇస్తావ
50 అడుగుతే 50 ఇస్తావ? అనీ కృష్ణభగవాన్ అంత వెటకారంగా చెప్పాడు ..........

అప్పటి దాక వాళ్ళ ఇద్దరినీ చూసి చిరాకు పడ్డ మేము ....అదే ఇద్దర్ని చూసి కాసేపు హాయ్ గా నవ్వుకున్నాం.......:)
ఓహ్ చెప్పనే లేదు కదా ఇంతకి Dsnr నుండి LB Nagar కీ ఆటోలో మాములు గా   8rs... అపుడు బంద్ కదా 10rs:)
ఆ  మొండి  ముసలోడు  ఎంత  ఇచ్చాడో  మరి  :)

మనసులో మాట:)

ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు రాబోయే రోజుల్లో నాకు  జ్ఞాపకాలు
నువ్వు మాట్లాడని రోజున నీ  జ్ఞాపకాలే నాతో మాట్లాడుతాయ్ ....:)