నేను చదువుకున్న మొదటి స్కూల్ దేవరకొండ లోని ఇందిరా పబ్లిక్ హై స్కూల్ .అయిదోవ తరగతి వరకు నేను అక్కడే చదువుకున్నాను . ఆ తరువాత అదే ఊరులో మేము మరొక చోటికి మాకం మార్చటం తో నా స్కూల్ కూడా మారిపాయింది కాని నా మనసు మారలేదు ,నా ఆలోచనలు మారలేదు .ఆ వీషయం నాకు చాల కాలం తరువాత అర్ధం అయింది .
ఈ స్కూల్ ,ఆ టీచర్స్ ,ఆ వాతావరణం ,ఆ స్నేహితులు నాకు చాల ఇష్టం . కానీ ఆ తరువాత ఏ ఒక్కరితోని నేను టచ్ లో ఉండలేదు .అప్పుడు కొత్త స్కూల్ ,కొత్త డ్రెస్ ,ఇంటికి చాల దగ్గరలో స్కూల్ అనే విషయాలే అర్ధం అయ్యేవి .. కాలం గడిచే కొద్ది నాతో పాటు నా మొదటి స్కూల్ జ్ఞాపకాలు నన్ను వెంటాడేవి ..జ్ఞాపకాలు మాత్రమే ఉండేవి ,ఆ జ్ఞాపకలలోని మిత్రులు మాత్రం ఎప్పుడు పెద్దగ కలవలేదు . నాకు మాత్రం నాతో పాటు అయిదోవ తరగతి చదివిన నా తోటి పిల్లలు అందరు ఇప్పటికి గుర్తున్నారు .వారిలో చాల స్నేహితులని అప్పటి నుండి ఇప్పటి వరకు నేను అసలు ఇప్పటికి కలవలేదు ,,,,ఎక్కడ కాంటాక్ట్ లేరు . చివరకి ఆర్కుట్క్ ,పేస్ బుక్ లో కూడా
శివ, శ్రీకాంత్, శేకర్ రెడ్డి ,మోహన్ రాజు రెడ్డి ,శంకేర్,రామి రెడ్డి ,రాఘవేంద్ర ,మాధవి,ప్రసన్న,లికిత,వరలక్ష్మి ,సరస్వతి ,మహిందర్ జీ ,అముజత్ పాషా,రమేష్ ఇలా అందరి చిన్ననాడు ఎలా ఉన్నారో నాకు బాగా గుర్తుంది .
ఇంటర్ కాలేజీ వాళ్ళ శివ నల్గొండ లో కలిసాడు . శంకేర్ నేను ఇంటర్ లో ఒకే క్లాసు :)
ఇంజనీరింగ్ వాళ్ళ శ్రీకాంత్ కలిసాడు ,వాడు మా కాలేజీ లోకి దగ్గరలోనే ఉన్న మరో కాలేజీ లో చేరాడు :)
శేకర్ రెడ్డి అప్పుడపుడు దేవరకొండ లో కలిసేవాడు . నాకు ఇప్పుడు వయసు తో పాటు బుద్ధి పెరిగింది కదా ,ఇక వీలందరి కాంటాక్ట్స్ తీసుకున్నాను . వీళ్ళు మాత్రమే నాకు
ఇప్పుడు టచ్ లో ఉన్నారు ...
నేను పైన రాసిన లిస్టు లో మొదట రాసిన నాలుగు పేర్లు నా జీవితం లో ఎప్పటికి మర్చిపోలేను . ఇక నేను కావాల్సింది మోహన్ రాజు రెడ్డ్తి ఎక్కడ ఉన్నదో ఏమి చేస్తునాడో .
నేను స్కూల్ మారగానే వాడు మారిపోయాడు అందుకే మా స్కూల్ ఫ్రెండ్స్ కీ ఎవరికీ అందుబాటులో లేడు.
పైన చెప్పిన లిస్టు లో ఒక అమ్మాయి , నాది పదోవ తరగతి పరీక్షా కేద్రం ఒక్కటే . అయిదు తరువాత చూసాను కాని వెంటనే గుర్తుపట్టాను
తను మాత్రం నన్ను గుర్తుపట్టలేదు .
మారో అమ్మాయి నీ హైదరాబాద్ లో లకిడ్కపూల్ లో చూసాను . ఈ అమ్మాయి నీ 1998 తరువాత 2007-08 లో చూసాను .పెద్దగ మార్పు కనపడలేదు నాకు వెంటనే చిన్నపాటి తన పేస్ ,ఎదురు గా ప్రసుత పేస్ కనపడ్డాయి. ఈ సారి కూడా దైర్యం చేయలేదు మాట్లాడలేదు . ఈ అమ్మాయి ఇపుడు ఆర్కుట్ ,పేస్ బుక్ దయ వాళ్ళ కాంటాక్ట్ లో ఉంది .
నా స్నేహితుల తరువాత నాకు బాగా ఇష్టమైన వారు లక్ష్మి టీచర్. స్కూల్ ఈ టీచర్ వాళ్ళదే . ఎంతో ప్రేమగా చూసుకునేది . ఎంతో బాగా చెప్పేవారు
chocolates ఇచ్చేవారు. నా రైటింగ్ ఒక మాదిరి గా బానే ఉండేది అందుకే నేను మూడోవ తరగతి లో ఉన్నపుడు రెండోవ తరగతి పిల్లల notes రాయమని ఇచ్చేది . నాలుగోవ తరగతి లో ఉన్నపుడు మూడోవ తరగతి వాళ్ళవి ఇలా ఉండేది, స్కూల్ అయిపోయాక సాయత్రం studyhour లో ఇదే పని చేసేవాళ్ళం
నేను స్కూల్ మారుతునాను అని తెలిసి మా ఇంటికి కూడా వచ్చింది వద్దు దూరం ఐతే మధ్యానం అక్కడే మాతో పాటు తింటారు అని
కాని టీచర్ కీ ఎందుకు శ్రమ అని ,అంత దూరం కష్టం అని అమ్మ నాన్న వద్దనారు :(
మాకు కొత్త స్కూల్ ,కొత్త డ్రెస్ ,గంట కొట్టక కూడా స్కూల్ కి వేల్లోచు అన్న ఆనందం లో మేము ఉన్నాం .
చివరగా నాకు ఎపుడైనా చిన్నపుడు కడుపు నొప్పి రా శివ అంటే వాడు ఒకటి చెప్పేవాడు . వేప చెట్టు దగ్గరికి వెళ్లి కళ్ళు మూసుకొని దండం పెట్టుకో రా తగ్గిపోతుంది అని
నిజంగానే తగ్గినట్టు అన్పిచేది .అది నిజమో కాదో తెలియదు కాని నేను చాల కాలం పాటు దాని నమ్మను ,అనుచరించాను :)
మహిందర్ జి ఏమో వాళ్ళకి ఉన్న షాప్ లో నుండి ఏదైనా స్వీట్స్ ,choclates ,Biscuits తెచ్చి నాకు మాత్రం తప్పకుండ ఇచ్చేవాడు
నాకు వీలందరి నీ ఒకసారి కలిసి నాకు మీరు అందరు గుర్తునారు , మిములని మన స్నేహాని మరువలేదు అని చెప్పాలని ఉంది
అందరిని ఒకసారి చూడాలని ఉంది , మీకు కూడా నేను గుర్తున్నాన :( ఇలా నన్ను తలచుకుంటూ ఉన్నారా :(

No comments:
Post a Comment